Facebook Twitter
కుల నిర్మూలన ఎలా?

కులమనే విషవృక్షానికి 

కొమ్మలు రెమ్మలు కాండము 

నరికితే కాదు దానిని 

కూకటివేళ్లతో సహా పెకలించి వేయాలి 

కుక్కల్ని పాలిచ్చే గోవుల్ని

పుట్టలో పాముల్ని పూజిస్తారు

ముష్టివాన్ని కుష్టువాన్ని 

ముట్టుకుంటారు కానీ కొందరు

సాటి మనిషిని శునకంలా చూస్తారు 

 

మూఢనమ్మకాల్ని మూలకునెట్టండి 

అదృష్టం కర్మసిద్ధాంతాలు ప్రక్కనపెట్టండి 

తిరుగులేని ఒక సంఘటితశక్తిగా మారి 

తిరుగుబాటు చేయండి 

తినడానికితిండి 

తీర్థయాత్రలుచేస్తే రాదు 

గంగలో మునకలు వేస్తే రాదు

పూజలు పునస్కారాలతో పుట్టదు

నిరంతరం శ్రమించాలి స్వేదం చిందించాలి

 

అలాగే రాజ్యాధికారాన్ని

ప్రశ్నించాలి ప్రతిఘటించాలి  

పోరాడి సంపాదించుకోవాలి

రాజులు కాలేకపోయినా రాజ్యాలు 

ఏలకపోయినా కనీసం బానిసత్వం 

నుండైనా మీకు విముక్తి లభిస్తుంది 

 

కులం కులమని అరవకండి 

కులంపునాదులపై ఒక జాతిని గాని 

ఒక నీతిని గానీ నిర్మించలేరని...

కృషి కసి పట్టుదలతోనే ఎవరైనా

ఉన్నత శిఖరాలను చేరుకోగలరని... 

కుళ్ళిన ఈ కులవ్యవస్థ నిర్మూలనకు

దివ్యమైనమార్గం వర్ణాంతరవివాహాలేనన్న...

అంబేద్కర్ అమృతవాక్కుల్ని కలనైనా మరువకండి