Facebook Twitter
అంబేద్కర్ అమృతబోధ

పూరిగుడిసెలో

పుట్టినా మేకలు

పులులై గర్జించాలి

 

ఆర్ధికంగా బలపడాలి

శుభ్రతను పాటించాలి

 

ఐక్యతగా వుండాలి

కులరక్కసిని కూల్చాలి

 

ఆశించే దశ నుండి 

శాసించేదశకు చేరుకోవాలి

 

పట్టుదలతో పోరాడాలి

రాజ్యాధికారం సాధించాలి

 

బౌద్ధమతాన్ని స్వీకరించాలి

ఆత్మగౌరవంతో  జీవించాలి

 

అందరు విద్యను ఆర్జించాలి

గొప్పకలలు కనాలి కష్టపడాలి

 

ఆపదలోవున్న వారిని ఆదుకోవాలి

దుర్వెసనాలకు దూరంగా  ఉండాలి

 

ఆ మహాత్యాగికి ఆ మహామేధావికి 

మనమర్పించే ఘననివాళి ఇదే ఇదే