సింహాసనం దక్కాలంటే?
ఓ బహుజన బిడ్డలారా!
తరతరాలుగా
నరనరాల్లో
పేరుకున్న ఈ
"కులజాడ్యం"
రావణకాష్టంలా
రగులుతూవుందని
ఇకనైనా నిద్రమేల్కొని
ఈ కంప్యూటర్ యుగంలోనైనా
మీరు కళ్ళు తెరుచుకొని
ఓ పచ్చినిజం తెలుసుకోండి!
పోయిన హక్కులు
ప్రార్థనలు చేస్తేనో
ప్రాధేయపడితేనో
బ్రతిమాలితేనో దక్కవని
సమిష్టిగా పోరాడాలని..
పోరాడితే పోయేది ఏమీలేదని
మీ బానిసత్వపు సంకెళ్లేనని..
సంఘంలో సమానత్వం
ఒక్క విద్యద్వారానే సాధ్యమని..
బలమైన ఒక ప్రభుత్వం
బలహీనుల చేతుల్లోనే వుందని..
రాజ్యాధికారానికి సఖ్యత
ఐక్యతలే ఆయుధాలని...
కలనైనా మరవకండి
కలిసిమెలిసి ఉండిండి
గుట్టుగా విభేదాలు
సృష్టించే గుంటనక్కలకు
చెప్పాలి గుర్తుండే "గుణపాఠాలు"
పోరాడాలి "కొదమసింహాలై "ఆపై
దక్కునండి మీకు "రాజ్యాధికారం"
చిక్కునండి మీకు "ఢిల్లీసింహాసనం"



