Facebook Twitter
మేము బహుజనులం !

మేమే బాహుబలులం ‌!!

 

వస్తున్నాం ! వస్తున్నాం !

ప్రేమతో మంచిని 

పంచితే గౌరవిస్తాం !

గుర్రాలపై ఊరేగిస్తాం !

గజమాలలతో ముంచెత్తుతాం !

 

వస్తున్నాం ! వస్తున్నాం !

నక్కినక్కితిరిగే

గుంట నక్కల

భరతం పడతాం !

మొక్కలే కదాని పీకేస్తే  

పీకలు కోసేస్తాం !

 

వస్తున్నాం ! వస్తున్నాం !

నమ్మించి నవ్వుతూ 

నట్టేటముంచితే నరికేస్తాం !

మాటువేస్తాం ! కాటువేస్తాం !

వెంటాడుతాం ! వేటాడుతాం !

గండ్రగొడ్డళ్ళతో వేటువేస్తాం !

కాలితే మా కడుపులు

మండితే మా గుండెలు 

భగభగమండే సూర్యులమై ! 

మిమ్ము మాడ్చి మసిచేస్తాం !

 

వస్తున్నాం ! వస్తున్నాం !

అవసరాలు తీరగానే

ఎంగిలి విస్తరాకుల్లా

వీధిలో చెత్తకుండీలో విసిరేస్తే

నరసింహావతారమెత్తి 

మీ గుండెల్ని చీలుస్తాం ! 

మిమ్ము కాల్చి బూడిద చేస్తాం !

 

వస్తున్నాం ! వస్తున్నాం !

కండబలముందని గుండెబలముందని 

ధనబలముందని కులబలముందని

విర్రవీగితే ముక్కలు ముక్కలు చేస్తాం ! 

మీ రెక్కలు విరిచేస్తాం !

పట్టపగలే చుక్కలు చూపిస్తాం !

వస్తున్నాం ! వస్తున్నాం ! బలహీనులం కాదు

మేము బహుజనులం ! మేమే బాహుబలులం !!