మీరు చీమలుకాదు సింహాలు !
ఎప్పుడైనా ఎవడైనా నీ శత్రువు
నిన్ను కుడిచెంపమీద కొడితే
ఎడమచెంప చూపమని
క్షమాగుణం కలిగుండమని పలికె
కరుణామయుడైన ఆ జీజస్ క్రైస్ట్
వద్దు వద్దు వెంటనే
గన్నుతో కాల్చి పడెయ్
పీడవిరగడై పోతుందని పలికె
అడవిలో ఓ నక్సలైట్ ఆవేశంగా
వద్దు వద్దు ఓపికపట్టు
పెన్నుతో రాజ్యాంగబద్దంగా
నిరంతరం పోరాడమని పలికే
రాజ్యాంగశిల్పి డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్
వద్దు వద్దు ఒంటరిగా వద్దు
బలమైన ఒక సంఘటిత శక్తిగా
శతృమూకలను ఎదిర్కోమని పలికె
అహింసామూర్తియైన ఆ బుద్దభగవాన్
చరిత్ర తిరగేస్తే తెలిసిందో నగ్నసత్యం
కస్సుబుస్సుమనే చాటుమాటుగా కాటేసే
కోరల్లో విషముండే కోడెనాగులు సైతం
బుద్దికలిగి ఒద్దికగా యుద్దానికి సిద్ధమైన
చలిచీమల చేజిక్కి సంహరించబడ్డాయని
అందుకే ఓ బహుజనులారా!
ఇకనైనా మీశక్తి మీరు తెలుసుకోండి!
మీరు చీమలుకాదు...సింహాలని...
పూరిగుడిసెలో...పుట్టిన పులులుమీరని...



