Facebook Twitter
ఓ బహుజనులారా !

మొన్న మీరు... 

బావిలో నీళ్లు త్రాగటానికి 

కొత్తదుస్తులు వేసుకోవడానికి 

 

నిన్న మీరు...

వీధిలో స్వేచ్ఛగా తిరగడానికి 

అన్యాయాన్ని ప్రశ్నించడానికి 

 

నేడు మీరు...

చక్కగా చదువుకోవడానికి 

ఆలయంలో ప్రవేశించడానికి 

అధికారం లేదాయె అవకాశం రాదాయె

 

అందుకే శాసనాధికారం‌ చేపట్టాలి

సంఘం విధించిన ఈ విషపూరిత

మోసపూరిత కక్షపూరిత ఆంక్షలను 

నిబద్దతలేని నియమాలను

కఠినమైన కట్టుబాట్లను కళ్ళగంతల్ని

ప్రతిఒక్కరు ప్రతిఘటించాలి 

ప్రగతిపథంలో పయనించాలి

విద్యను అభ్యసించాలి

విజ్ఞానం ఆర్జించాలి

విదేశాల్లో విహరించాలి

 

సంఘంలో‌సమానత్వం 

విద్యతోనేసాధ్యం 

ఆర్థిక బాధలు తొలగి

ఆకలి తీరి ఆరోగ్యంగా ఉంటారు 

మంచి-చెడు తెలుసుకుంటారు 

న్యాయ అన్యాయాల గురించి 

అణచి వేతల గురించి 

బానిసత్వం గురించి ఆలోచిస్తారు 

సంఘజీవిగా మారిపోతారు 

 

ఆత్మగౌరవంకోసం ఆరాటపడతారు

పోయిన హక్కులకోసం సమాజంలో 

సమానత్వం కోసం పోరాడతారు

గర్వంగా తలెత్తుకు తిరుగుతారు 

నిర్భయంగా నిశ్చింతగా బ్రతుకుతారు

చిరునవ్వులతో సిరిసంపదలతో

శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు

సుఖసంతోషాలతో ప్రశాంతంగా జీవిస్తారు