నేడే 14 ప్రమాణాలు చేద్దాం !
డాక్టర్ భీమ్ రావ్ రాంజీ
అంబేద్కర్ తాను
14 వ సంతానంగా
14 ఏప్రిల్ 1891న జన్మించినందున
14 ప్రమాణాలు చేయమంటున్నారు
తు.చ.తప్పక పాటించమంటున్నారు అవి:
1. అందరు విద్యను ఆర్జించాలని
2. ఆర్ధికంగా బలపడాలని
3. దుర్వెసనాలకు దూరంగా ఉండాలని
4. కమ్మని కలలు కనాలని కష్టపడాలని
5. శుభ్రతను పాటించాలని
6. అందరూ ఐక్యతతో సఖ్యతగా జీవించాలని
7. ఆపదలో వున్న నీ వారిని తక్షణమే ఆదుకోవాలని
8. కులరక్కసిని కూల్చి నవసమాజాన్ని నిర్మించాలని
9. హిందువుగా మరణించక బౌద్ధమతం స్వీకరించాలని
10. ఆత్మగౌరవంతో బ్రతకాలని
11. పూరిగుడిసెలో మేకలైపుట్టినా పులులుగా మారాలని
12. ఆశించే దశనుండి శాసించే దశకు చేరుకోవాలని
13 .కొదమసింహాలై గర్జించాలని పట్టుదలతో పోరాడాలని
14. రక్తం చిందించైనా రాజ్యాధికారం సాధించాలని
ఆ మహాత్యాగికి ఆ మహామేధావికి ఆ అమరజీవికి
అశ్రునయనాలతో అర్పించే ఘననివాళి ఇదే ఇదే ఇదే ఇదే



