ఎవరినైనానీవు దొరా దొరా అన్నావంటే
ఓ దొరా నీవు నా తలపై కెక్కు
నన్నుఅధః పాతాళానికి అణద్రొక్కు అని అర్ధం
ఎవరినైనానీవు రాజా రాజా అన్నావంటే
వాడు Yes నేను King నే
నా తలపై బంగారు కిరీటం పెట్టు
నీవు నా Servant వి వంగి నాకు సలాం కొట్టు అంటాడు
ఎవరినైనానీవు అన్నాఅన్నా అన్నావంటే
వాడు Yes నేను అన్ననే నీకన్నా అన్నింటా నేమిన్ననే
నీవు మాత్రంగుండు సున్నవే అంటాడు
ఎవరినైనానీవు స్వామి స్వామి అన్నావంటే
వాడు Yes నేను స్వామినే వెంటేశ్వర స్వామినే
నిన్ను మాత్రం కొండకొచ్చి గుండు గీయించుకో మంటాడు
ఎవరినైనానీవు గురూ గురూ అన్నావంటే
నీవే వాడికి గురువుగా గొప్ప గుర్తింపు నిచ్చినట్లు
నీకు నీవే వాడి శిష్యుడిగా శిక్ష వేసుకున్నట్లు
ఎవరినైనానీవు బ్రదర్ బ్రదర్ అన్నావంటే
వ్యక్తులు వేరైనా భావాలు ఒక్కటే అని
ఆపదే వస్తే ఒకరికొకరు ప్రాణాలు అర్పించుకుంటారని అర్ధం
అవును ఒక్కటి మాత్రం పచ్చి నిజం
ఒకరిని నీవు ఆకాశానికి ఎత్తు తున్నావంటే
నీవు అగాధానికో అదఃపాతాళానికో జారిపోతున్నావని అర్ధం



