కలిసి వుంటే కలదు సుఖం
నిన్న
నాలుగు ఎద్దులుఏకమై
నడుస్తున్నప్పుడు
పులి చెట్ల చాటున
గుట్టల మాటున
నక్కినక్కి తిరిగింది
ధైర్యం చేసి దగ్గరకొస్తే
కొమ్ములతో ఎద్దులు కుమ్మేశాయి
పాపం పులి పరుగులు తీసింది
నేడు నాలుగు ఎద్దులు
నాలుగుదారుల్లో నడుస్తుంటే
గమనించిన పులి
గట్టిగా గర్జించింది
గంతులు వేసింది
గొంతులు కొరికింది
కలిసి వుంటే కలదు సుఖం
విడిపోతే బ్రతుకు విషాదం
కలిసివుంటే చలిచీమలు సైతం
సర్పాలను సంహరిస్తాయి
విడిపోతే ఎద్దులైనా ఏనుగులైనా
అడవిలో పులులకు ఆహారమౌతాయి



