Facebook Twitter
Do or Die

ఎప్పుడు
ఏ సమస్య వచ్చినా
ఎదురీదు
లేదా ఏటిలో దూకి చావు
పిరికి పందలా పారిపోకు
పిచ్చివాడిలా దిగులు పడకు
దిక్కులు చూడకు 
కుక్కలా తోక వూపుతూ  ప్రక్కకు తప్పుకోకు
కసితో దీక్షతో కక్షతో
పిడికిలి బిగించి
ఉక్కులా మారితే చాలు
ఉపాయం దొరికుతుంది
దైర్యం చేసి ఎదుర్కో
లేదా దానికి లొంగిపో
ఎదుర్కొంటే
ఏదో ఒక రోజు
విజయంతో పొంగిపోతావు
ఎదుర్కోలేక లొంగిపోతే
ఏదో ఒక రోజు
లోలోన కుమిలిపోతావు క్రుంగిపోతావు
అంతే ఇక అంతా నీఇష్టం