అలా వద్దు ఇలా
ఆకులు మేసే మేకల్లాగ
తోకలు ఊపే కుక్కల్లాగ
గొడ్డు చాకిరి చేసే గాడిదల్లాగ
గుడ్డిగా దూకే గొర్రెల్లాగ
బెదురు చూపులు చూసే జింకల్లాగ
బావిలోనే తిరిగే కప్పల్లాగ
పంజరాల్లోని పక్షుల్లాగ బ్రతుక్కండి
గాండ్రించే పులుల్లాగ
గర్జించే సింహాల్లాగ
ఘీంకరించే మదపుటేనుగుల్లాగ
బుసలు కొట్టే కోడెనాగుల్లాగ బ్రతుకండి
ఆధారపడినంత కాలం మీరు అనాధలే
అడుగునుండు బడుగు వర్గాలే
అణగారిన అణద్రొక్కబడిన అమాయకులే
అందుకే ఓ పీడిత ప్రజలారా
పిడుగుల్లా అడుగులు ముందుకు వేయండి
పిడికిలి బిగించి పోరాడండి -ప్రచండశక్తితో ప్రతిఘటించండి
పోతే పోవచ్చు మీ బానిసత్వం- వస్తే రావచ్చు మీకు సమానత్వం



