ఓ మిత్రమా!
గమ్యం సుదూరమని
చేరలేనేమోనని
పరుగు మాత్రం ఆపకు...
నీళ్లు పడలేదని
బావిని త్రవ్వడం ఆపకు...
పీడకలలు వస్తున్నాయని
కలలుకనడం ఆపకు...
పరీక్షలు పాస్ కాలేదని
చదవడం మానకు...
ఉద్యోగం రాలేదని
ఇంటర్వూస్ కెళ్లడం మానకు...
పూజారి ప్రసాదం పెట్టలేదని
గుడికెళ్లడం మానకు...
పాడిగేదె పాలివ్వడం లేదని
మేత వేయడం మానకు...
ఓ మిత్రమా! ఒక్కవిషయం
మాత్రం ప్రతినిత్యం గుర్తుచేసుకో!
నేడు ఆటలో గెలిచినవాళ్లంతా
ఒక రోజు ఓడినవాళ్ళేనని...
నేడు పరిగెత్తేవాళ్ళంతా
ఒకనాడు పడి లేచినవాళ్ళేనని...
అందుకే ఓ మిత్రమా!
ఈరోజు కాకున్నా రేపైనా
ఇప్పుడు కాకున్నా
మరెప్పుడైనా ఏనాడైనా
నీ శ్రమకు ఫలితందక్కేరోజు
ఉందన్న దగ్గరలోనే ఉందన్న
నీ అపజయాలన్నీ విజయాలుగా
మారే ఒక మంచిశుభదినం
నీ ముందరే...ఒకేఒక్క అడుగు
దూరంలో ఉందన్న
ఓ నగ్నసత్యం తెలుసుకో !
నిట్టూర్చకు.!..నిరాశ చెందకు !
వెరవకు ! వెనుతిరగకు.!
కానీ ఆ ఒక్క అడుగు ముందుకు
వెయ్యడం మాత్రం...మరువకు !



