నిజజీవిత నిత్యసత్యాలు
జన్మ నిచ్చిన అమ్మానాన్నలే ప్రత్యక్ష దైవాలు
నవ్వు నలుగురిలో ఏడుపు ఏకాంతంలో
వార్ధక్యం శాపం కాదు యవ్వనం శాశ్వతం కాదు
సహనంతో సమయస్పూర్తితో సాధించలేదేమీ లేదు
ముదిరిపోయిన బెండకాయ కూరకు పనికిరాదు
ధనమేరా అన్నింటికి మూలం అంటోంది కాలం
రక్తపాతం లేకుండా ఏ యుద్ధము ముగియదు
హాని చేస్తుందని తెలిసీ పులిని పూజించడం వెర్రితనమే
సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవాడే విశ్వవిజేత
ముఖాముఖి చర్చలే మనస్పర్థలకు మందులు
కక్షలు కార్పణ్యాలు వద్దు శాంతి సమాధానాలే ముద్దు
మన మంచితనం మానవత్వమే మనకు ఆభరణాలు
నీలో నిత్యం వెలిగే ఆత్మే నీకళ్ళకు కనిపించని నీ దైవం
యముడెవరికి బంధువుకాదు అందరికీ బద్దశత్రువే
ముందర మృత్యువున్నా భయపడరు త్యాగమూర్తులు
రాత్రింబవళ్ళు శ్రమించి స్వేదం చిందించి అందరి
ఆకలితేర్చే అన్నదాతలే ధరణిలో నడిచే ధైవాలు



