Facebook Twitter
గుప్పెడంత ఆశ గుండెల్లో...

మనం‌ కళ్ళు

మూసుకుంటే

..."కటికచీకటి"

...అది మన సృష్టి

 

సూర్యుడు

పశ్చిమకొండల్లో

కన్నుమూస్తే

..."చిమ్మచీకటి"

...అది సృష్టికర్త సృష్టి

 

మనిషి లైట్లు ఆర్పేస్తే

..."అంధకారం"

...అది మానవ సృష్టి

 

చీకటికి...ముందు

"వెలుగే" ఉంటుంది

..."అది నిజం"

చీకటికి...వెనుక

"వెలుతురే" ఉంటుంది

..."అది నమ్మకం"

 

చుట్టూ కమ్ముకున్న

చిమ్మచీకటిలో కూర్చుని

చీకటిని తిట్టుకునే కన్న

"చిరుదీపం"

వెలిగించడం మిన్న

లేకున్న కాసింత ఓపిక

పట్టమని పెద్దలమాట

 

కారణం ఖచ్చితంగా

రేపు "వేకువ" వస్తుంది

వెలుగుకిరణాలను తెస్తుంది

చిమ్మచీకటిని చీల్చివేస్తుంది

 

చితికిన చీకటిజీవితాల్లో

"చిరుదివ్వెల్ని" వెలిగిస్తుంది

మోడువారిని బ్రతుకుల్ని

చిగురింపజేస్తుంది

 

అప్పుడు

"వర్తమానం"

"వసంతభరితమే"

అది "ఆ భగవంతుని వరమే"...

"భవిష్యత్తు" సైతం

"బంగారుమయమే"...

"గతం" గందరగోళమైనా

గాఢాంధకారమైనా భయం లేదిక...

గుండెలోని ఆ గుప్పెడంత

ఆశే...ఔషధం......

ఆయుధం...అమృతం...ప్రతిమనిషికి...