సోమరులకు చిరుసందేశం
ఓ మనిషీ !
బద్దకం నీ దగ్గరి బంధువైతే...
సోమరితనం నీకు సోపానమైతే...
ధనలక్ష్మి ధాన్యలక్ష్మీ కనకలక్ష్మీ
జ్ఞానలక్ష్మీ ఆరోగ్యలక్ష్మీ ఆనందలక్ష్మీ
భాగ్యలక్ష్మి సౌభాగ్యాలక్ష్మీ కడకు ఏలక్ష్మీ
నీ గడపదాటి లోనికి తొంగిచూడబోవు
అశాంతి అవమానాలే నీకు బహుమానాలు
ఎప్పుడో ఒకప్పుడు చేసిన అప్పుల్లో
నీవు పీకలదాకా కూరుకుపోతావు
తీర్చేదారేలేక ఆ అప్పులనిప్పుల్లోనే
కుప్పకూలిపోతావు కాలిబూడిదైపోతావు
దారిద్య్రం నిన్ను ధహించివేస్తుంది
సిరిసంపదలు సుఖసంతోషాలు
నీకు బద్దశత్రువులౌతాయి
చిరునవ్వులు ముఖం చాటేస్తాయి
అందుకే ఓ సోమరి !
చీమల వద్ద శిక్షణపొందు
ఇష్టపడి కష్టపడి పనిచేయడమెలాగో !
ముందుచూపుతో జీవించడమెలాగో !
నేర్చుకో ! శ్రమదీపం వెలిగించుకో !
చీకటిలో కూర్చుని చింతించకు !
వెలుగుకోసం వెతుకు గౌరవంగా బ్రతుకు !



