అబద్దం చెప్పకు ఆడినమాట తప్పకు...(మినీ కవిత)
ఓ మనిషీ ! ఈ నోట
ఇచ్చిన మాట - చచ్చినా సరే మరువకు
కారణం...
పరబ్రహ్మ స్వరూపమైన ఆహారాన్ని
పరమానందంగా భుజించేది...ఈ నోటనే...
పవిత్ర గ్రంధాలైన భారత భాగవత
బైబిల్ భగవద్గీత రామాయణాలను
పగలురేయి భక్తితో పఠించేది...ఈ నోటనే....
సృష్టి కర్తయిన ఆ భగవంతుణ్ణి
ప్రతినిత్యం ప్రార్ధించేది స్తుతించేది
స్మరించేది ఘనంగా కీర్తించేది...ఈ నోటనే....
ఏమిఎరగని,ఏ కల్మషంలేని
బోసినవ్వుల చిన్నారులను
"దీర్ఘాయుష్మాన్ భవ"...అంటూ
"ఎవరెస్టు శిఖరంలా"...ఎంతో
ఎత్తుకు ఎదగాలని దీవించేది...ఈ నోటనే....
అందుకే...
అట్టి నోట అబద్దం చెప్పకు చెప్పకు...
ఆడిన మాటెన్నడు తప్పకు తప్పకు...
సో బి స్లో టు ప్రామిస్ బట్ బి క్విక్ టు పర్ ఫాం...



