మొన్న త్రయోదశని
నీ భార్యకు బంగారు
నగలు కొనిపెట్టావు
నిన్న పుట్టిన రోజని నీ పిల్లలకు
కోరిన "కాష్ట్లీగిఫ్ట్" లు ఇచ్చావు
"బ్రాండెడ్ బట్టలు" కొనిపెట్టావు
ఫైవ్ స్టార్ హోటల్లో
బంధువులందరిని పిలిచి
బర్త్ డే ఫంక్షన్ "గ్రాండ్" గా చేశావు
నేడు దీపాల పండగని
స్టేటస్ కి సింబల్ గా
ఖరీదైన క్రాకర్స్ కొన్నావు
ఇష్టమని అందరికి
పుల్లారెడ్డి స్వీట్లు
డ్రైప్రూట్స్ ప్యాకెట్లు
ఇంటికి పట్టుకెళ్ళావు
నిజమే వీరంతా నీవారు
ఇది నీ కుటుంబం
వీరంటే నీకు పిచ్చి ప్రేమ
వీరి ఆనందమే నీ ఆనందం
వీరి సుఖమే నీ సుఖం
వీరికోసం నీ బ్రతుకంకితం
వీరి శ్రేయస్సు కోసమే నీ శ్రమ
కాని ఇదంతా ఒక పిచ్చి భ్రమ
కారణం కడరోజు నీతో వచ్చే దెవరు?
ఇది పచ్చినిజం ఇది జగమెరిన సత్యం
అందుకే నీవు తిరిగిన
ఆ బంగారు షాప్ దగ్గరే
ఆ బ్రాండెడ్ బట్టల
షాపింగ్ మాల్ దగ్గరే
ఆ పుల్లారెడ్డి స్వీట్ షాప్ ప్రక్కనే
వుండే వుంటారు
నీడలేని "నిరుపేదలు"
వుండే వుంటారు
ఆకలికి అలమటించే "అనాధలు"
వుండే వుంటారు
పిడికెడు మెతుకులకు కోసం
చెత్తకుండీల దగ్గర
కుక్కలతో కుస్తీ పట్టే
దిక్కుమొక్కులేని
బక్కచిక్కిన 'బడుగుజీవులు"
చూడు ఒక్కసారి చూడు
చిరిగిన ఎంగిలి విస్తరాకుల్లాంటి
చిధ్రమైన చిత్రవిచిత్రమైన
వారి జీవితాల్లోకి
కన్నీరు ఇంకిన వారి కళ్ళల్లోకి
"ఒక్కసారి "తొంగి చూడు"
ఎండిన వారి పేగుల్లో నుండి వచ్చే
ఆకలి కేకలు "ఒక్కసారి విను"
వీలైతే నీ వారికోసం పెట్టే ఆ ఖర్చులో
ఎంతో కొంత వీరికీ కూడా ,"కేటాయించు"
ఆ దైవం తప్పక నిన్ను "ఆశీర్వదించు"
ఆయురాగ్యైశ్వర్యాలను "నీకు అనుగ్రహించు"
ప్రశాంతమైన జీవితాన్ని "నీకు ప్రసాదించు"
అందుకే ఓ మిత్రమా!
"పేదలపై కురిపించు నీ ప్రేమజల్లు"
"వర్ధిల్లు హాయిగా నిండూనూరేళ్లు"



