ఇదినిజమేలే
వెలిగినంత సేపు
చిరుదీపం
వెలుగులు
విరజిమ్మేలే
చిమ్మచీకటిని
తరిమేలే
ఆపై ఆరిపోయి
తిరిగి ఆ చీకటి
ఒడిలో చేరేలే
ఇదినిజమేలే
వయసులో
ఒళ్ళంతా కులుకేలే
వయసు తరిగిన
అందం కరిగిన
విధి జీవితాన
విషాదం చిలికేలే
ఇదినిజమేలే
మిడిమిడి ఙ్ఞానంతో
పడిలేస్తూ
ప్రతిరోజు పరుగేలే
మిడిసి మిడిసి పడేది
మిణుగురు పురుగేలే
మిగిలింది ఇక ఆ
పరమాత్మ పిలుపేలే
ఇదినిజమేలే
జీవితమంటే
ప్రతినిత్యం
చీకటి వెలుగేలే
ఓటమి గెలుపేలే
తెలుపు నలుపేలే



