ఆశకు హద్దుండాలి మనిషికి బుద్ధుండాలి
నన్ను ఎవరు
ఏమనుకుంటే నేమి ?
నలుగురు నవ్వితే నేమి?
చాటున ఛీఛీ అన్ననేమీ ?
మూఖాన ఉమ్మివేసిన నేమి?
నేను మాత్రం
ఎవరెస్టు శిఖరంపైన వుండాలి
పరులు మాత్రం పాతాళానికి పోవాలి
అన్న మనస్తత్వం మంచిది కాదు
అట్టి కేటుగాడితో సమాజానికి చేటు
వాడు సమానత్వానికి అర్థం తెలియని సన్యాసి
వాడు మంచితనం మానవత్వం లేని ఒక మృగం
ఆశబోతుతనానికి సైతం కాస్త హద్దు వుండాలి
పెద్దమనిషి అన్న తర్వాత కాస్త బుద్ధి వుండాలి
అబద్ధాలు ఆడేవాడెన్నడూ అభివృద్ధి చెందలేడు
పరులను వంచించేవాడి ప్రయాణం పరలోకానికే



