నీతిలేని సంకరజాతి ?
కుండను పగలగొట్టి
కూడుదిన్న కుక్కను
నవ్వుతూ నవ్వుతూ లోతుగా
గోతులు త్రవ్వేనక్కను నమ్మవచ్చు
కక్కినదానికి ఆశపడే కుక్కను
నమ్మినవారిని నట్టేటముంచే
నక్కను సైతం నమ్మనూవచ్చు
నక్క కడుపున పుట్టిన కుక్కను కాని
కుక్క కడుపున పుట్టిన నక్కను కాని
నమ్మరాదు నమ్మరాదు నమ్మనేరాదు
అవి "సంకరజాతి" జంతువులు
వాటి తోకలే కాదు...వంకర"
వాటి బుద్దులు కూడా "వంకరటింకరే"
అవి పేరుకే "కుక్కలు నక్కలు"
వాటిని నమ్మిన వారికి
అవిచూపిస్తాయి "ఆకాశంలో చుక్కలు"



