స్పందించు ఆపన్నహస్తం అందించు ....
ఎవరైనా ఆర్థికపరమైన
అవసరాల్లోవుంటే
వెంటనే స్పందించు
చిరునవ్వు చిందించు
స్నేహహస్త మందించు
నేను నిప్పని
నీతికి నిజాయితీకి నిలువుటద్దమని
నేను మనిషినని మ్రానును కానని
మంచితనానికి మానవత్వానికి
మారుపేరని నిన్ను నీవు నిరూపించుకో
ప్రతివారిని ప్రేమించు
ఆప్యాయంగా పలకరించు
ఆపదలో ఉన్నవారిని ఆదుకో
నేనున్నానన్న ఒక భరోసా నివ్వు
చేతకానివాడే
చేతులు ముడుచుకుంటాడు
మాటరానివాడే మౌనంగా వుంటాడు
ఆడలేనివాడే కదా మద్దెల ఓడంటాడు
అరిచే కాకిని కరిచే కుక్కను కసురుకుంటారు
ఆడే నెమలికి పాడే కోకిలకి ఫ్యాన్స్ వుంటారు



