మొన్న "వందల్లో"- రేపు "కోట్లల్లో"
మొన్న మన తాతముత్తాతల
వ్యాపారం, ఖర్చు "వందల్లో"
నిన్న మన అమ్మానాన్నల
వ్యాపారం,ఖర్చు "వేలల్లో"
నేడు మన వ్యాపారం,
మన ఖర్చు "లక్షల్లో"
రేపు మన పిల్లల
వ్యాపారం, ఖర్చు "కోట్లల్లో"
సందేహం లేదు, కారణం ఒక్కటే
నిజానికి,తరతరానికి, ఆకాశానికి
రాకెట్లలా దూసుకుపోయే "ధరలే"
నింగిలో ధగధగ మెరిసే తారలను
తాకాలని తహతహలాడే "ధరలే"
మిట్టమధ్యాహ్నం భానుడిలా
భగ్గునమండే "ధరలే"
సందేహం లేదు లేనేలేదు



