Facebook Twitter
రెచ్చిపోయే ఓ పిచ్చి కోతి

ఎందుకే ఓ పిచ్చి కోతి
అలా రెచ్చిపోతావు ?
ఎందుకే కొరివితో
తల గోక్కుంటావు?
ఎందుకే చిక్కితే
చీల్చి చెండాడే
చిరుతల తలలమీద
చిందులు వేస్తావు

ఆయుష్షు వుంది కాబట్టి
అందలేదు కాబట్టి
బ్రతికి పోయావు
ఒక్కకొమ్మ విరిగి
క్రిందబడితే ముక్కలే గదా!
మృత్యువుతో
చెలగాటం మూర్ఖత్వం కాదా!

ఎందుకే ఓ పిచ్చి కోతి
అలా రెచ్చిపోతావు
రెచ్చిపోతే చచ్చిపోతావే