ఫ్లాట్ల మీద లాభం ఎంత ?
నికరంగా
2, 3 సంవత్సరాలలో
2, రెట్లు రావొచ్చు
4,5 సంవత్సరాలలో
అదృష్టం ఒక్కసారి మనల్ని
గట్టిగా తన్నితే చాలు
గారెల బుట్టలో పడడం ఖాయం
"ఆ" అవునా అంటూ
అందరు ఆశ్చర్యపోయేలా
3,4 రెట్లు లాభం రావొచ్చు
ఆకాశంలో ఓ అద్భుతం
తోకచుక్కరాక అలాగే
అదృష్టం కలిసి వస్తే
ఆదాయంలో కూడా ఓ అద్భుతం
కలలో కూడా ఊహించని
ఒక వింత జరగవచ్చు
నేటి లక్షాధికారి
రేపు కోటీశ్వరుడై
కొండెక్కి కూర్చోవడం ఖాయం
ఇందులో
ఏ మాయా లేదు
ఏ మంత్రం లేదు
ఏ మ్యాజిక్ లేదు
ఒక చిన్న లాజిక్ తప్ప
కొంచెం ధైర్యంతో
కొంచెం నమ్మకంతో
కొంచెం తెలివితో
కొంచెం పెట్టుబడి పెట్టడం తప్ప
కాని,
ఆదాయం - ఆరోగ్యం - ఆయుష్షు
ఈ మూడు మాత్రం
ఆ పరమాత్మ ప్రసాధించే వరాలే
ఎవరికైనా ఎంతటి వారికైనా



