Facebook Twitter
నవపారిజాతం....

ప్రేమను
కొండల్లో
గుండెలోతుల్లో
జలపాతమైదూకనియ్

పచ్చని
వరిమాగాణిలా
ముచ్చటపడనియ్

మల్లెతీగలా
మధురంగా
మాట్లాడనియ్

మనసునిండా
వరదగోదారిలా
మానససరోవరంలా
గలగల ప్రవహించనియ్

ఈ జీవితానికి
అర్థం పరమార్థం
స్వార్దమైతే
స్వాగతం పలుకు...

నిస్వార్థమైతె
కాళ్ళుకడిగి
కనకాభిషేకం చెయ్...

ప్రేమేఐతే
ప్రపంచమంతా
పారిజాత పుష్పమై
పరిమళించనియ్...