ఒక చిక్కుప్రశ్న?...
ఎక్కడో
ఎందుకో పడింది
ఒక చిక్కుముడి?
గుడిలోనో గుండెలోనో...
అది
అద్దంలా
పగిలి ముక్కలుగా
మిగిలిన ఒక చిక్కుప్రశ్న ?
ఓ మనిషీ ఇకనైనా
నిన్న నీవు కలలుగన్న
నీ గమ్యం నీవు చేరినట్టేనా?
ఒక్కసారి
నీఆత్మ అద్దంలోకి
పావురంలా పాలపిట్టలా
తొంగిచూసి ప్రశ్నించుకో
ఈ ఒక్కసత్యాన్ని
మాత్రం ఎన్నడూ
సమాధిచేయకు...
గొడ్డలితో నరికి
గోతిలోనికి నెట్టకు
మట్టిముద్దని
మాత్రంముద్దాడకు...



