మార్పు...ఉదయించే తూర్పు
మొద్దు నిద్దుర పోయే ఎద్దును
ముల్లు కర్రతో గ్రుచ్చి లేపవచ్చు
మొద్దు నిద్దుర పోతున్నట్లు
నటించే మనిషిని నిద్ర లేపలేము
స్పందనకు అభినందనకు అర్థం
తెలిసీ...తెలియనట్టుంటే వారిని
నిందించలేము నిలదీయలేము
బండబారిన కసాయిగుండెగల
మొండి వారిని కదిలించలేము
కరిగించలేదు పూర్తిగా విశ్వసించలేము
సంస్కారం సంపదని మనసంస్కృతికి
ప్రతిబింబమని తెలిసినా విస్మరించేవారికి
నమస్కరించలేము వారిని సంస్కరించలేము
అలాగని ప్రయత్నించడం మానరాదు
మనిషిలో మార్పుకు ఉదయించే తూర్పుకు
ఒక అంతుచిక్కని అవినాభావ సంబంధం
ఉందన్న పచ్చినిజాన్ని కలనైనా మరువరాదు



