Facebook Twitter
ముందుచూపు 

ముందుచూపుగల వారి 

జీవితాలు వడ్డించిన విస్తర్లు 

సుఖశాంతుల 

సుందర నందనవనాలు 

అదే ముందుచూపు 

కరువైన కుటుంబాలు 

విధి వక్రించి వీధినపడి 

ఆకలితో అప్పులతో 

అలమటిస్తుంటాయి 

 

ముందుచూపున్న 

కొందరి జీవితాలు 

ఖరీదైన బ్యాంకుఖాతాలు 

అదే ముందుచూపులేని 

కొందరు జీవితాలు

విధి వ్రాసిన విషాదగీతాలు

 

ముందుచూపున్న 

జీవితం తాజాహోటల్లో

పసందైన విందుభోజనమే

ముందుచూపులేని 

జీవితం అగమ్యగోచరమే

అంధకార బంధురమే

 

ముందుచూపున్న 

ప్రతిఇంటా...పారు పన్నీరు 

ముందుచూపు కరువైన 

ప్రతికంటా...కారు కన్నీరు

 

ముందుచూపున్న 

ప్రతిఇంటా...ఆనందపు అలలే 

ముందుచూపు కరువైన

ప్రతికంటా...కన్నీటికలలే