కోల్పోయిన విగ్రహం
మొన్న ఆ విగ్రహం నిగ్రహం కోల్పోయింది
కారణం -అమాయకపు ప్రజల జీవితాలతో ఆడుకునే
ఉగ్రవాదులమీద ఉక్కుపాదం మోపలేక పోయినందుకు
నిన్నఆ విగ్రహం వీధిలో విలపించింది
కారణం-అవినీతి బంధుప్రీతి లంచగొండితనం
దేశంలో విచ్చలవిడిగా పెరిగి పోతున్నందుకు
నేడు కదిలిస్తే చాలు ఆ విగ్రహం కన్నీరు కారుస్తుంది
కారణం-మోడి పెద్ద నోట్లన్నీ తక్షణమే రద్దన్నందుకు,
కొత్త నోట్ల ముద్రణ కొంతకాలం వద్దన్నందుకు
ప్రజలంతా బ్యాంకు లముందు ATM ల ముందు క్యూలు కట్టినందుకు
అందిన 2 వేలు ఎక్కడా మారనిందుకు, ఆకలి అవసరాలు తీరనందుకు
వీధిలోని ఆ విగ్రహమే గందరగోళంలోవున్న మన గాంధీ తాత
కాని ఈ పెద్ద నోట్ల రద్దుతో మారబోతున్నదట ప్రజలందరి తలవ్రాత



