Facebook Twitter
పాపాలభారం...శాపాలతీరం...

నీ నీడ నీకు దూరమయ్యేదెప్పుడు?
నీ శ్వాస నీకు భారమైనప్పుడు...

నీ పాపాల భారం తీరేదెప్పుడు?
నీవు నీ శాపాలతీరం చేరినప్పుడు...

నీ లక్ష్యాన్ని నీవు ఛేదించేదెప్పుడు ?
నీ శ్రమకు నీవే ప్రత్యేక్ష సాక్ష్యమైనప్పుడు...

నీవు వెలిగించిన ఆ దీపాలదాహం తీరేదెప్పుడు?
నీవు చిమ్మచీకట్లను చిత్రవధ చేసినప్పుడు...

స్మశానవాటిక నీకు స్వాగతం పలికేదెప్పుడు?
నీ దేహం దెయ్యమై తిరుగుతున్నప్పుడు...

నీ ఓటమి నీకు గుణపాఠం నేర్పేదెప్పుడు?
నీ గెలుపుగాలం ఆ పరమాత్మ చేతిలోవున్నప్పుడు...

నీకు అవినీతికి పాల్పడే అధికారపీఠం దక్కేదెప్పుడు?
నీవు నీతి నిజాయితీని నిప్పులో వేసి కాల్చినప్పుడు...