ఓ విజ్ఞానమా నీవెక్కడ ?
ఓ విజ్ఞానమా నీవెక్కడ ?
వినోదభరిత విహారయాత్రలలో నేనక్కడ
అందరిని అలరించే ప్రకృతిలో నేనక్కడ
ఓ విజ్ఞానమా నీవెక్కడ ?
వేదాలను ఔపాసన పట్టిన
మేధావుల ప్రసంగాలలో నేనక్కడ
సాహితీస్రష్టల ఇష్టాగోష్టుల్లో నేనక్కడ
ఓ విజ్ఞానమా నీవెక్కడ ?
విద్యా కేంద్రాల్లో
విజ్ఞాన భాండారాల్లో నేనక్కడ
బూజు పట్టిన మూలకు నెట్టిన
బృహత్ గ్రంథాలలో నేనక్కడ
ఓ విజ్ఞానమా నీవెక్కడ ?
చేసేప్రయాణాల్లో
చుట్టూ పరిసరాల్లో నేనక్కడ
ఓ విజ్ఞానమా నీవెక్కడ ?
అనంత విశ్వాన్ని నిరంతరం
అన్వేషించే మీ అంతరంగాల్లో నేనక్కడ



