చూడకు ఎవరినీ చులకనగా....
ఎదుటి వారిని చులకనగా చూడడం
వారు బాధ పడుతూవుంటే సంతోషించడం
వారు ఆర్థిక ఇబ్బందుల్లో వుంటే ఆదుకోకపోగా
ఆనందంతో చిందులు వెయ్యడం
ఇతరులముందు తక్కువ చేసి మాట్లాడడం
అవమానంగా అసహ్యంగా అతినీచంగా అసభ్యకరంగా అభ్యంతరకరంగా మాట్లాడడం
ఎగతాళిగా హేళనగా నవ్వడం
ఏవగించుకోవడం ఏహ్యభావం కలిగివుండడం
అట్టివారెవరైనా అదేవారి పతనానికి పరాకాష్ట
వీరి సత్సంబందాలన్నీ సమాధి అవుతాయి
వారు నలుగురిలో నవ్వులపాలైపోతారు
అట్టివారికి అంతటా ఓటమే తప్ప విజయాలుండవు
అంతటా అవమానాలే తప్ప గౌరవాలుండవు
ఒంటరితనం వారిని వెక్కిరిస్తుంది వెంటాడుతుంది,
ప్రతినిత్యం మృత్యువు వారిని తప్పక వేటాడుతుంది
వారి జీవితం మోడువారుతుంది
చివరికి వారి బ్రతుకు చితికిపోతుంది
అందుకే
ప్రతి జీవిని ప్రేమించు కోపాన్ని అధిగమించు
ధర్మాన్ని అనుసరించు అహింసను ఆచరించు
ఆర్జించింది అనుభవించు ఆనందంగా జీవించు



