రుదిరస్నానం....
మన ఆచార వ్యవహారాలు
అతి ప్రచారాలతో
అతి విశ్వాసాలతో
అతి విద్వేషాలతో
వింత పోకడలకు
విత్తనాలైతే
అది ఘోరసంక్షోభానికి
సంకేతమే,
మన ఆచారవ్వహారాలు
ఒక నీతిని
ప్రబోధించినంతకాలం
ఒక జాతి
నిర్మించినంతకాలం
నిస్తేజమైన జనాలను
జాగృతి చేసినంతకాలం
ఏ ప్రమాదం లేదు
మన ఆచారవ్యవహారాలే
మన నియమ నిబంధనలే
మన కఠినమైన కట్టుబాట్లే
మన సంస్కృతి సాంప్రదాయాలే
కొందరి అంధవిశ్వాసాలకు
బంధీలైతే అప్పుడంతటా
విషాదమే వినాశనమే
విధ్వంసమే
కొందరి అధికారం అహంకారం
అణచివేతలకు అసమానతలకు
స్వేచ్ఛా స్వాతంత్రాలకు
సోదర భావాలకు
సంకెళ్లు వేసినప్పుడే
తూర్పున సూర్యుడు
రుదిరస్నానం చేసేది
ఎర్రని తిరుగుబాటు
జెండాలు ఎగిసిపడేది
ధిక్కారస్వరాలు దిక్కులు
పిక్కటిల్లేలా నినదించేదీ
పిడుడికిళ్ళు పిడుగులు కురిపించేది
గళాలు కత్తులై కుత్తుకలు త్రెంచేది



