కడలి కన్నీరు కారుస్తోంది ?
కడలి కన్నీరు కారుస్తోంది ఎందుకు ?
అనాది నుండి అరనిముషమైనా
అలల పరుగును ఆపలేకున్నందుకు
తరతరాలుగా ఆ ఉప్పొంగే తరంగాలు
ఎగసి ఎగిసి పడుతూనే ఉన్నందుకు పడి
క్షణాల్లో తనలోనే కలిసిపోతున్నందుకు
కడలి కన్నీరు కారుస్తోంది ఎందుకు?
తనలో ఉన్ననీరంతా ఉప్పగాఉన్నందుకు
ఎవరి దాహం తీర్చలేకపోతున్నందుకు
కరిగే మేఘాలైనా కరుణించనందుకు
సుజలబింధువులను వర్షించనందుకు
కడలి నవ్వుతోంది ఎందుకు?
ఆకాశాన ప్రచండ భానుడు ఎంతగా
వేడెక్కినా భగభగమని భగ్గునమండినా
ఇన్నేళ్ళైనా ఇన్నాళ్లైనా తానెండిపోనందుకు
కడలి నవ్వుతోంది ఎందుకు?
తన గర్భంలో లక్షల కోట్ల
జీవజలరాశులు ఆణిముత్యాల నిధులున్నందుకు
గట్టునున్నవారికి గవ్వలు
మునిగినవారికి ముత్యాలు దొరుకుతున్నందుకు



