Facebook Twitter
ఎన్నో ప్రశ్నలు ఇక్కడ సమాధానాలు ఎక్కడ?


మా మతం  
హిందూమతం 
మాకు దేవుళ్ళు దేవతలు కోకోల్లలు 
బ్రహ్మ విష్ణు ఈశ్వరులతో పాటు 
రాముడు కృష్ణుడు వెంకటేశ్వరుడు
వినాయకుడు ఇంకా ఇంకా అనేకమంది

ఇంతమంది ఎందుకంటే 
మా హిందూమతం 
ఇండియాకు ఇంజన్ లాంటిది
మా దేవుళ్ళందరు ఇంజన్లో డ్రైవర్లు 
మా హిందూమతం
ఇండియాకు బ్యాంకు లాంటిది
మా దేవుళ్లందరు బ్యాంకులో
మేనేజర్లు అంటారు కొందరు మేధావులు

అలాగైతే 
ఆ డ్రైవర్లను ఆ మేనేజర్లను
నియమించేందుకు
వారికి నెలనెలాజీతాలు ఇచ్చేందుకు 
పై అధికారంటూ ఒకరుంటారు  
మరి ఈ దేవుళ్ల పైనున్న 
ఆ పరమాత్ముడెవరు ?

ఇంజన్లో డ్రైవర్లు బ్యాంకులో మేనేజర్లు
ఉన్నట్లు గుడిలోనే దేవుళ్ళుంటారా?

అవును హాస్పటల్లో డాక్టర్లున్నట్లు
గుడిలోనే దేవుళ్ళుంటారు
మరి సర్వ శక్తిమంతుడైన ఆ దేవుడు 
సర్వాంతర్యామికాడా ? 

భూమ్యాకాశాలను,సముద్రాలను
సూర్యచంద్ర నక్షత్రాలను సృష్టించిన
ఆ దేవుడు సృష్టికి ముందు 
ఎక్కడ వుండేవాడు?

నిజంగా దేవుడునిరాకారుడేనా?
ఐతే రూపమే లేని దేవుడికి 
పేరెక్కడిది?

అసలు భగవంతుని భాషేమిటి?
మన భాష భగవంతుడికి అర్థమౌతుందా?

సృష్టి జరిగిన తర్వాత ఏ ఒక్కరికైనా
దైవదర్శనం జరిగిందా?

దైవంతో ముఖాముఖిగా లేదా
అదృశ్యంగానైనా సంభాషించిన వారెవరైనా వున్నారా?

సృష్టిలో మొట్టమొదటి జన్మించిన మొట్టమొదట మరణించిన మనిషి ఎవరు?ఎప్పుడు ?ఎక్కడ ?ఎలా ?

సృష్టిలే మరో జన్మ మనుషులకేనా 
జంతువులకు పశుక్ష్యాదులకు లేదా?

మూగజంతువులకు పశుక్ష్యాదులకు దేవుడెవరు?

మూగజంతువులు మనతో మాట్లాడేదెప్పుడు ?

కనిపించని గాలి మన కళ్ళకు
కనిపించేదెప్పుడు ?

స్వర్గ నరకాలెక్కడున్నాయి? కళ్ళతో చూసిందెవరు?

ఈ జనన మరణాలకంతమెప్పుడు?

వ్యక్తి శక్తి భక్తి ముక్తి ఈ పదాల 
అంతరార్థమేమిటి?

మన కళ్ళముందే ఏనాడో కట్టిన
ఖరీదైన  ఒక ఇంద్ర భవనం వుంటే
మరి దాన్ని కట్టినవాడు దానికి డబ్బులు పెట్టినవాడు ఉన్నారన్నది పచ్చినిజమైతే

ఈ అవంతమైన ఈ అద్బుతమైన 
ఈ అఖండమైన సృష్టి పుట్టుకకు ఒక వ్యక్తి కాని ఒక శక్తి కాని వుండి వుంటారు 

అన్నింటికి సమాధానం ఒక్కటే
నమ్మకం - నమ్మకం  - నమ్మకం