కంటిలో కలలు - కడలిలో అలలు
కళ్ళల్లో కలలుంటాయి
ఆ కలల ప్రయాణం వేకువ వరకే
కడలిలో అలలుంటాయి
ఆ అలల ప్రయాణం తీరం వరకే
కలలు చెదిరినా కరిగినా
కలతచెందకు కన్నీరు పెట్టుకోకు
అలల అలజడికి కడలి
అల్లకల్లోలమైనా అదరకు బెదరకు
మదిలో కలలు ఉండవు
పగటి కలలెప్పుడూ కనకు
కలలు నిజం కావని అనకు
నీకలలు పండేదాక కునుకుతీయకు
నదిలో అలలు ఉండవు
కడలిలో పడిలేసే అలలే
అటుపోట్లు అవే నేర్పుతాయి
జీవితాన గుణపాఠాలు
పడినందుకు బాధపడకు
పడినా పైకిలేచి పరిగెత్తే వాడికే
ప్రతిఫలితం దక్కునన్నది పచ్చినిజం
ఎగిసెగిసిపడుతూ ముందుకు
దూసుకు వచ్చే ప్రతిఅల
తిరిగి వెనక్కి వెళ్ళక తప్పదు
కలల సాకారానికి శ్రమించేవారిని
నేడో రేపో విజయలక్మి వరించక తప్పదు



