నేడు ఆశపడి ఆయాసపడి
అడుగులు ముందుకేసేవాడే
రేపు తప్పక అభివృద్ధి చెందుతాడు
రేపు కష్టపడడానికే ఇష్టపడే?
నేడు ప్రేమలోయలో మాయలో
పడినా పరవాలేదు పైకిలేవవచ్చు
కాని రేపు శీలం చెడిపోతేనే ప్రమాదం
నేడు హోరుగాలికి
కొమ్మలురెమ్మలు విరిగినా ఒరిగినా
పరవాలేదు చెట్టు మళ్లీ చిగురిస్తుంది
కాని రేపు తుఫానుకు క్రూకటివ్రేళ్ళతో
సహా పెకలించబడితేనే ప్రమాదం
నేడు వాడిపోయినా ఎండకు
ఎండిపోయినా పరవాలేదు
కాని రేపు పండి చెట్టునుండి
రాలిపోతేనే పండైనా
పత్రమైనా క్రుళ్ళిపోయేది
నేడు తాను తినక దానంచెయ్యక
దాచి పెట్టిన ధనంపోతే దరిద్రులౌతారు
కాని రేపు ఉన్న వూరుపేరు చెడితే
చరిత్రహీనులైపోతారు
నేడు పోటీలో దిగి
ఆడి ఓడినా పరవాలేదు
కాని రేపు ఓటమి భయంతో
ఆట మధ్యలో ఆడలేక
పోరాడలేక పారిపోతేనే అవమానం
నేడొక బికారివై సిగ్గువిడిసి
అడిగినా పాదాలుతాకి
ప్రాధేయపడినా పరవాలేదు
కాని రేపు బిక్షగాడివై అందరిని
అడుక్కోవడమే తప్పు
నేడు గంజినీళ్ళు త్రాగినోడే
అదృష్టవంతుడు
రేపు అమృతం త్రాగేవాడికన్న
అవనికి అమృతం తెచ్చినవాడు లేడు
అది త్రాగి అమరుడైనవాడూ లేడు



