వద్దుఆగొద్దు నీ పరుగును ఆపొద్దు...
ఓ మిత్రమా ! నిన్న నీవు
లోతుగా ఆలోచించావు
గట్టిగా ప్రయత్నించావు నేడు
ఓ మంచి పనిని ప్రారంభించావు
శ్రద్ధగా ఆచరిస్తున్నావు
ఆశతో ప్రయాణం సాగిస్తున్నావు
ఐతే అవాంతరాలు ఎన్నొచ్చినా
అడ్డంకులు ఎన్ని ఎదురైనా
కోలుకోలేని దెబ్బలు ఎన్ని తగిలినా
సమస్యలెన్ని చుట్టుముట్టినా
విధి ఎంతగా పగబట్టినా
కాలం కాలనాగై బుసలుగొట్టినా
వద్దు ఆగొద్దు నీ లక్ష్యం చేరేవరకు
నిద్ర పోవద్దు నీ పరుగును ఆపొద్దు
అడిగితేనే ఏదైనా ఇవ్వబడుతుంది
తడితేనే ఏ తలుపైనా తెరవబడుతుంది
వెదికితేనే ఏ నిధియైనా దొరుకుతుంది
అని "పరిశుద్ధ గ్రంథం" ప్రభోదిస్తుంది
అందుకే వద్దువద్దు ఆగొద్దు
నీ లక్ష్యం నెరవేరేవరకు
నీ పరుగును ఆపొద్దు నిద్రపోద్దు
పట్టుదలతో ప్రయత్నించేవాడికి
అడుగు ముందుకేసి ఆశతో అడిగేవాడికి
నిరాశ చెందక నిద్రాహారాలు మాని
"నిరీక్షించేవాడికి నిధి"తప్పక దొరుకుతుంది
నా మాట వింటారు కదూ...
ఆ నిధిని కనుగొంటారు కదూ...



