పదిఆజ్ఞలు...పదిప్రమాణాలు
అది మిలమిల మెరవాలి
కళకళ లాడాలి కిలకిలనవ్వులు
గలగల గాజుల సవ్వడులే తప్ప
జలజలమని కన్నీటిచుక్కలు రాలకూడదు
ఆ జంట కనులపంటగా ఉండాలంటే
వారు ఏడడుగులు నడిచి
వేసుకున్న ఆ మూడుముళ్లను
ఇక్కడ అమ్మానాన్నలు అత్తామామలు
అతిథులు బంధువులు శ్రేయోభిలాషులే కాదు
అదృశ్యంగా దివినుండి ఆ దైవం దీవించాలి
నూతన వధూవరులిద్దరు
అందరిలో పెళ్లి పందిరిలో
"రెండు మనసులు" ఒక్కటై
'మూడు ముళ్లబంధంతో"
"ఏడడుగులు" నడిచి
"పదిఆజ్ఞలను" పాటించి
"పదిప్రమాణాలను" కట్టుబడి
భగవంతున్ని నమ్ముకుని జీవించే
ఆ భార్యా భర్తల్ని వేరుచెయ్యడం
ఆ మూడుముళ్లబంధాన్ని తెంచడం
ఈ భూమిమీద ఎవడితరం కాదు
వారి జన్మ ధన్యం వారి జంట నూరేళ్ళపంట
వారి కాపురం ఆపరమాత్మ దీవించిన పచ్చనికాపురం



