Facebook Twitter
ఓ యూదులరాజా ! ఓ యేసురక్షకా !

మీ భక్తులమైన మేము
మిమ్మును కోరేదొక్కటే...
ఎందరో కుంటి, గుడ్డి,చెవిటి,
మూగ,మూర్చ,కుష్టు,
పక్షవాత రోగులకు స్వస్థత చేకూర్చి
పీడించే దెయ్యాలను తరిమికొట్టినట్లుగా
కంటికి కనిపించక
నక్కినక్కితిరిగే ఈ కరోనా రక్కసిని...
కలువరిగిరి సాక్షిగా శిలువవేసే సమాధిచేసే అతీంద్రియశక్తిని...
మాకు ప్రసాదించండి ఓ పరలోకపు తండ్రీ!

అందరిని చల్లగా చూసే ఓ అల్లా! 
మీ భక్తులమైన మేము 
మిమ్మును కోరేదొక్కటే...
తాళలిబాన్ ఉన్మాదిలా...
ఐయస్ఐ ఉగ్రవాదిలా...
ఉగ్రరూపందాల్చి
అగ్రరాజ్యాలనే అల్లకల్లోలం చేస్తున్న
విశ్వంపై విరుచుకుపడి
విలయతాండవం చేస్తున్న...
కంటికి కనిపించక
నక్కినక్కితిరిగే ఈ కరోనా రక్కసిని...
రాళ్ళతో కొట్టి మక్కాసాక్షిగా మట్టుపెట్టే
మాంత్రికశక్తిని...
మాకు ప్రసాదించండి ఓ పరమాత్మా!