2+7+3=12 = పరిశుద్ధ వివాహం
ఓ నవ దంపతులారా !
నిన్నటివరకు మీరు వేరు వేరు
ఎవరికి వారు ఒక్కరే, నేడు
"2"మంచి మనసులు కలసి
రెండు కొత్త కుటుంబాలు ఏకమై
జాతకాలు ఒకటై జత చేయబడ్డారు
జంటగా మారారు
అంటే
అందరిలో పెళ్లిపందిరిలో
అదృశ్యంగా ఉన్న ఆ దేవదూతల సాక్షిగా
ఆ కరుణామయుడి
కృపావరములు మీపై కుంభవర్షమై కురిసి
ఏనాడో పార్కులో
"7" అడుగులు నడిచిన మీరు నేడు
"3" ముళ్లబంధంతో ఏకమయ్యారు
ఇంతగా దీవించబడిన మీ దాంపత్యం
మూడుపువ్వులు ఆరుకాయలు కావాలంటే
మీరు బహుగా ఆశీర్వదించబడాలంటే
మీరు ఆత్మీయ ఫలాలు పొందాలంటే
మీరు బంగారు బిడ్డల్ని కనాలంటే
మీరు సుఖజీవనం సాగించాలంటే
"12"ఆజ్ఞలు మీరు తప్పక పాటించి తీరాలి



