ఏమిలాభం ? ఏమిలాభం ?
ముందుచూపు లేనివారి నెత్తిన
ఎన్ని ముత్యాలు పోసినా
ఏమిలాభం? ఏమిలాభం?
వారికి వాటి విలువ తెలియదుగా ...
ఏమిలాభం ? ఏమిలాభం ?
ఆస్తి మీద ఆశలేని నిరాశావాదులకి
ఎన్ని మంచి ఆదాయమార్గాలు చూపినా
ఎన్ని చక్కని సలహాలిచ్చినా ?
ఏమిలాభం? ఏమిలాభం?
వారు అవి స్వీకరించరుగా ...
చక్కిలిగింత లేనివారిని
ఎంతగా గిల్లినా ఎంత గిచ్చినా
ఏమిలాభం ? ఏమిలాభం ?
వారసలు నవ్వనే నవ్వరుగా...
భయమూ భక్తి, వినయమూ విధేయత
తల్లిదండ్రులపై ప్రేమ,గురువులంటే గౌరవంలేని,
విద్యార్థులకెన్నిపాఠాలు చెప్పి ఎంత శిక్షణిచ్చినా
ఏమిలాభం? ఏమిలాభం ?
బుర్రకెక్కితేగా,బుద్ది వికసిస్తేగా...
బద్దకమూ,సోమరితనం తప్ప
చేసేపనిపై ఏకాగ్రతలేని ఉద్యోగికెంత
జీతమిచ్చి,ఎన్ని ప్రమోషన్లిచ్చినా
ఏమిలాభం? ఏమిలాభం ?
సంస్థ అంటే గౌరవముంటేగా...
వారెవరినీ నమ్మరు,ఎంత చెప్పినా వినరు
వారొట్టి మట్టి ఏనుగులు, బావిలో కప్పలు
రెక్కలున్నా ఎగరలేని పక్షులు,
కారణం,వారికి పైకి ఎదగడం,
తెలివిగా బ్రతకడం తెలియదు కాబట్టి.



