మన మాటలే మనకు ఉరి...సిరి...ఊపిరి ...
మన మాటల్లో మాధుర్యం
మన మాటల్లో మంచితనం
ఉండాలి.......ఉండి తీరాలి
మన మాటల్లో మమకారం
మన మాటల్లో మనోధైర్యం
మన మాటల్లో మానవత్వం
ఉండాలి.......ఉండి తీరాలి
మన చేతల్లో మూఢత్వం
మన మాటల్లో మాత్సర్యం
మన మనసులో మాలిన్యం
ఉండరాదు....ఉండనేరాదు
మన చూపుల్లో కౄరత్వం
మన తలంపుల్లో మూర్ఖత్వం
ఉండరాదు....ఉండనేరాదు
కారణం మనమాటలే మనకు "ఉరి"
మనమాటలే మనకు "సిరి ఊపిరి"
అందుకే జరా జాగ్రత్త! సుమీ జరా జాగ్రత్త!



