Facebook Twitter
రెండక్షరాల రోగం 

మాకు తెలివి -     "లేదు లేదు"

ఇది మావల్ల  -      "కాదు కాదు" 

మాకు ఏ పనీ  -    "రాదు రాదు" 

మేమేమీ చేయ్య - "లేము లేము" అనే 

రెండుపదాలు  -    "పదే పదే పలికేవారు"

 

ముందు చూపులేని మూర్ఖులు

పరమ బద్దకస్తులు, సోమరిపోతులు

శుంఠలు, వెదవలు,వెర్రివాళ్ళు,దద్దమ్మలు

 

అట్టివారి ఆలోచనలన్నీ అభివృద్ధి వైపు.. 

ఆకాశంవైపు...వెలుగువైపుకు కాదు

అథఃపాతాళంలోకే...అంధకారంలోకే...

 

అట్టివారితో జట్టుకట్టకు నీవు వారివల్లో చిక్కుకోకు

నీవు ముందుకు దూసుకు పోవాలనుకుంటే వారికి

ఆమడదూరంలో కాదు అరవైమైళ్ళదూరంలో ఉండాలి

 

లేకున్న అంటుకోవచ్చు మీకా "రెండక్షరాలరోగం"నాడు సమస్యలమయమే జీవితం...కన్నీళ్లు కష్టాలు ఖాయం