Facebook Twitter
కష్టేఫలి...శ్రమయేవ జయతే....

ఏ పులైనా...

గుహలోపడుకొని గురకలు పెడుతుంటే

ఆపై లేచి ఆకలంటూ కేకలు పెడుతుంటే

అడవిలో జంతువులొచ్చినోట్లో

పడతాయా? లేదే ఆకలి తీరుతుందా ? లేదే

 

ఏ రైతైనా...

ఎద్దులున్నా పొలమున్నా

అదనుచుసి పదును పెట్టకుండా

పొలం దున్నకుండా సాగు చేయకుండా

విత్తనం వేయకుండా "ఇంట్లోకూర్చుంటే"

ఇంటికి‌ పంట వస్తుందా? రాదే

ధాన్యంతో గాదెలు నిండుతాయా? లేదే

 

ఏ విద్యార్థైనా...

పరీక్షలు వ్రాయకుండా, పాసవకుండా 

ఇంటర్యూలకు వెళ్ళక కంప్యూటర్ గేమ్స్

ఆడుకుంటూ "ఇంట్లో కూర్చుంటే"

ఇంటికి ఉద్యోగం వస్తుందా?  రాదే

నెలకు జీతం వస్తుందా ? లేదే

 

ఏ వ్యక్తి ఐనా...

చేతిలో అగ్గిపెట్టె వున్నా

ఇంట్లో దీపమున్నా వెలిగించకుండా

చిమ్మచీకటి కమ్ముకున్నదని

"చింతిస్తూ కూర్చుంటే"ఏంటిలాభం?

వెలుగు వస్తుందా ? రాదే

చీకటి తొలుగుతుందా ? లేదే

 

ఏ తండ్రైనా...

తన కూతురు అందమైనదని

అమెరికాలో చదివిందని ఊరంతా చెప్పినా

సంబంధాలు చూడక "ఇంట్లో కూర్చుంటే"

ఇంటికి అల్లుడు వస్తాడా ? రాడే

కూతురుకు పెళ్ళవుతుందా ? లేదే, ఔను

 

ఏపనికైనా, ప్రతిఫలానికైనా "ప్రయత్నమే" గట్టిపునాది

అందుకే "శ్రమయేవజయతే" అన్ననినాదం మరువరాదు