ఈ సువిశాలమైన ప్రపంచాన్ని
విహారయాత్రలపేర వీక్షించినవారు
విశిష్ట వ్యక్తిత్వమున్నమహనీయుల
సత్సాంగత్యం కాంక్షించినవారు
వారికి అత్యంత సన్నిహితంగా వున్నవారు
వారి జీవితాల్లోకి తొంగిచూచినవారు
చర్చలతో వాదోపవాదాలతో
వారి భావోద్వేగాలను పంచుకొన్నవారు
వారి గొప్పతనాన్ని వారి దినచర్యలను
నిత్యం కర్మలను భారీ ప్రణాళికలను
ప్రతినిత్యం లోతుగా పరిశీలించినవారు
వారు చేపట్టే బృహత్తర కార్యక్రమాలలో
భాగస్వాములయ్యే భాగ్యాన్ని పొందినవారు
వారి ఆశయాలను ఆకళింపు చేసుకొన్నవారు
వారి అడుగుల్లో అడుగులు వేసినవారు
వారిని ఆదర్శంగా తీసుకొన్నవారు
వారి సందేశాలను శ్రద్ధగా ఆలకించినవారు
సలహాలు స్వీకరించినవారు
అనుభవాలను వడబోసినవారు
వారుపడిన బాధలనను అనుభవించిన
కష్టనష్టాలను
ఎదురైన అడ్డంకుల్ని ఎలా తట్టుకొన్నారో
వచ్చిన సమస్యలను సవాళ్ళను
తగిలిన ఎదురుదెబ్బల్ని ఎలా సహించారో
సహనంతో శాంత చిత్తంతో ఎలా
అసాధ్యాలను సుసాధ్యం చేశారో గమనించినవారు
వారి ప్రజ్ఞాపాటవాలను శక్తిసామర్థ్యాలను...
సాహసకృత్యాలను ప్రత్యక్షంగా వీక్షించినవారు
వారిలా జీవించాలని మనసారా భావించినవారు
వారిని రోల్ మోడల్స్ గా తీసుకొని ఏకలవ్యులైనవారు
వారికన్న మిన్నగా కిర్తిప్రతిష్టలను ఆర్జిస్తారు
ముందుతరాలకు ఆదర్శమూర్తులౌతారు
వీరి విశిష్ట వినూత్న సేవలు సువర్ణాక్షరాలతో
లిఖించబడతాయి అందరిచే కీర్తింపబడతారు
చరిత్రలో చిరంజీవులుగా మిగిలిపోతారు
దివిలో ధృవతారలుగా వెలిగిపోతారు
వారే మీరైతే... మీరు సైతం
ఆ కీర్తిశిఖరాలను అవలీలగా అధిరోహిస్తారు....



