Facebook Twitter
నాది నాది అనుకున్నది నీది కాదు…

నేను నాది అనే భావన నశిస్తేనే

మనము మనది అనే భావన 

ఎదఎదలో పొదపొదలోఉదయిస్తేనే

జీవితానికర్థం పరమార్థం లేకున్న వ్యర్థం

 

వాసన చూసి పువ్వును 

రుచిని చూసి కాయను 

ఇంటిని చూసి ఇల్లాలిని

విద్యనుచూసి గురువును గుర్తుపట్టినట్లే

ఉన్నతమైన ఉదాత్తమైన లక్షణాలున్న

ప్రతిమనిషిని గుర్తించాలి గౌరవించాలి

 

మనసును అదుపులోపెట్టుకున్నవాడే

సత్యాన్ని అంటిపెట్టుకోగలడు

ధర్మబద్ధంగా జీవించగలడు

కట్టెగా మారేవరకు తీసుకున్న 

నిర్ణయానికి కట్టుబడి ఉండగలడు

పురాణాల మేలిమిరత్నాలతో

మనసును అలంకరించుకోగలడు

అప్పుడే ఏ మనిషైనా రత్నంలా 

ఆణిముత్యంలా మెరిసిపోగలడు

 

నదినదిలా ప్రవహిస్తున్నంత కాలం

గొప్పదే కాని అది  కడలిలౌకలిశాక 

తన అస్తిత్వాన్ని కోల్పోతుంది

మనసు అదుపులో ఉన్నంత కాలం

మనిషి మహాత్ముడే కాని కోరికల సంద్రంలో 

కొట్టుకుపోయిన నాడు ఉనికినికోల్పోతాడు