పక్షులమై స్వేచ్ఛగా బ్రతుకుదాం
గూటిలో గువ్వల్లా గుసగుసలాడుకుందాం
మనసువిప్పి మాట్లాడుకుందాం
గుండెల్లో తియ్యనిజ్ఞాపకాలను దాచుకుందాం
ఓ సోమరీ ! చీమలు దగ్గరకు వెళ్ళు
చలికాలంలో అవి ఎంతో శ్రమిస్తాయని...
వర్షాకాలంలో ఏ చీకుచింతా లేకుండా
సుఖంగా సంతోషంగా బ్రతుకుతాయని...
సోమరితనం పేదరికాన్ని ప్రేమిస్తుందని...
ప్రజలకు ప్రబోధిస్తుంది పరిశుద్ధ గ్రంథము
ఓ మనిషీ ! బారులుతీరి ఆకాశంలోఎగిరే
ఆ పక్షుల దినచర్యను తిలకించు ఒకసారి అవి
నేలమీద మనిషులకెన్నో పాఠాలు నేర్పుతాయి
ఉదయాన్నే నిద్రలేవాలని కష్టించి పనిచేయాలని...
ఎవరీ మీద ఆధారపడక ఆకలివేటకెళ్ళాలని...
ఎర్రనిఎండలో ఎగరాలని కుంభవర్షంలో తడవాలని...
ఆకలితీరగానే చీకటీపడగానే గూటికి చేరుకోవాలని...
సూర్యుని కన్న ముందు లేచినవారే సుఖపడతారని...
కష్టేఫలని కష్టాలు సురకత్తులై గుచ్చుకుంటున్నా ఎన్ని
ఇబ్బందులు భూతాలై భయపెట్టినా ధైర్యాన్ని వీడరాదని...



