సత్కవి సందేశం...
సంస్కారం తెలిసినప్పుడే...
సమానత్వం చూపినప్పుడే...
సమయస్ఫూర్తితో మెలిగినప్పుడే...
సహనం సర్దుబాటుగుణం కలిగినప్పుడే...
సమాజంలో కీర్తిప్రతిష్టలు దక్కేది
సన్మానాలు సత్కారాలు పొందేది
సమతుల్య ఆహారం తీసుకున్నప్పుడే...
సకాలంలో వ్యాయామం చేసినప్పుడే...
సంతోషంతో సంతృప్తితో వున్నప్పుడే...
సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే...
సంపూర్ణమైన ఆరోగ్యం దొరికేది
సక్సెస్ ఫుల్ గా జీవితం గడిచేది
సందేహాలతో సతమతం కానప్పుడే...
సమస్యలకు భయపడి పారిపోనప్పుడే...
సకాలంలో సద్బుద్ధితో వ్యవహరించినప్పుడే...
సత్సంకల్పంతో సకర్మలను ఆచరించినప్పుడే...
సంపాదనను అభవించే అదృష్టం కలిగేది
సమాధానం సంతృప్తి బ్రతుకున మిగిలేది
సర్వేశ్వరుని కృపా కటాక్షాలు లభించేది
సర్వేజనో సుఖినోభవంతు అనిపించేది



