Facebook Twitter
విజయలక్ష్మి వరించే వీరాధివీరులు

నియమనిష్టలతో భక్తి విశ్వాసాలతో 

నిత్యం భగవంతున్ని సేవించేవారు

 

తమలోని శక్తి సామర్థ్యాలను, సమయాన్ని

సంపూర్ణంగా సద్వినియోగం చేసుకున్నవారు

 

ఎవరో వస్తారని ఏదో చేస్తారని

నిరీక్షించనివారు నిరాశ చెందనివారు

 

దక్కని చక్కని అవకాశలను దక్కించుకునేవారు

అదృష్టంపైకాక స్వశక్తిపైనేఎక్కువ ఆధారపడేవారు

 

ఏ ఒక్క అవకాశాన్ని కూడ చేజార్చుకోనివారు

ప్రతిఅవకాశంలో ఒక అవార్డును తిలకించేవారు

 

అద్భుతమైన అవకాశాలను సృష్టించుకునేవారు

ఆ అవకాశాలనఖండవిజయాలుగా మార్చుకునేవారు

 

అనితరసాధ్యమైన విజయాలను సాధించిన

మహనీయులందరిని నిరంతరం స్మరించుకునేవారు

 

వారి ఆశయాలను రోజు గుర్తుచేసుకునేవారు

వారి అడుగుల్లో అడుగులు వేసి నడిచేవారు

 

చరిత్రను సువర్ణాక్షరాలతో లిఖిస్తారు

అందరి హృదయాలను గెలుచుకుంటారు

 

అమరజీవువులుగా...

ఆదర్శప్రాయులుగా...

చైతన్యజ్యోతులుగా...

ధృవతారలుగా...

ప్రభాత సూర్యునికి 

ప్రతిబింబాలుగా...

నిరంతరం వెలుగులు 

విరజిమ్ముతూ వంటారు...

ఆ విజేతలనే ఆ విశ్వవిజేతలనే

ఆ వీరాధివీరులనే విజయలక్ష్మి వరించేది

ఆశూరులే కీర్తికిరీటాన్ని శిరమున ధరించేది